బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్, రేడియేషన్, కిమోథెరపీ … బ్లడ్ కాన్సర్లకు యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక చికిత్స

image.img.620.highమన దేశంలో ప్రతీ రోజు సుమారు 2800 మందిలో బ్లడ్(రక్తపు)కాన్సర్ వ్యాధిని గుర్తిస్తున్నారు. అంటే  రెండు నిముషాలకు ఒక వ్యక్తికి  డాక్టర్లు ఈ వ్యాధిని నిర్ధారిస్తున్నారు.  అమెరికా( ప్రతి మూడు నిముషాలకు ఒకరు), యూ.కె.(ప్రతి  పద్నాలుగు నిముషాలకు ఒకరు.) కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ.  వయస్సు, ఆర్థిక-సామాజిక పూర్వరంగంతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల వారిలో కనిపిస్తున్న  బ్లడ్ కాన్సర్లు, వాటి నివారణ – చికిత్సల గుర్చి అవగాహన లేకపోవటంతో లక్షల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు అకాల మరణం పాలవుతున్నారు. సరైన సమయంలో గుర్తించితే వ్యాధి తీవ్రత ఆధారంగా మందులు (కీమోథెరపీ)వాడటం, రేడియేషన్, మూలకణ మార్పిడి (బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్) చికిత్సల ద్వారా ఈ కాన్సర్లను నుంచి విముక్తిపొందే అవకాశం ఉంటుంది. ఇందుకుగాను బ్లడ్ కాన్సరు రకాలు, వాటి లక్షణాలు, చికిత్సా పద్దతులను గుర్చి తెలిసి ఉండటం ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

బ్లడ్ కాన్సర్ అంటే ఏమిటి?

పలురకాల కాన్సర్లు అన్నింటినీ కలిపి సాధారణ భాషలో బ్లడ్ కాన్సర్ అంటున్నారు.  బోన్‌మారో, రక్తం, లింఫ్ నోడ్స్-  లింఫ్ నాళాలు – టాన్సిల్స్- ఆహారనాళంలోని లింఫాయిడ్ కణజాలం- స్ల్పీన్ (ప్లీహము)  తో కూడిన లింఫ్ వ్యవస్థకు సంబంధించిన కాన్సర్లను బ్లడ్ కాన్సర్లు అంటున్నారు. సాధారణంగా కనిపించే బ్లడ్ కాన్సర్లయిన ల్యూయుకేమియా, మైలోమా కాన్సర్లు బోన్‌మారోలో ప్రారంభమవుతాయి. లింఫోమా కాన్సర్లు లింఫ్ వ్యవస్థలో మొదలవుతాయి. మనశరీంలోని కొన్ని పొడవైన తొడ, తుంటి ఎముకలలో ఉండే కొవ్వుతో కూడిన మొత్తటి స్పాంజిలాంటి పదార్థమే బో్న్మారో(ఎముక మజ్జ). దీనిలో పరిక్వత చెందని కణాలు, స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇవి  ఎర్రరక్త కణాలు (ఆర్.బి.సి.), తెల్లరక్తకణాలు(డబ్ల్యూ.బి.సి.), ప్లేట్ లెట్స్ గా  అభివృద్ధి చెందుతాయి.  రక్తంలోని  ఆర్.బి.సి. కణాలే శరీరంలోని అన్ని అంగాలు, వాటిలోని కణాలకు ఆక్సీజనును అందజేస్తుంటాయి. డబ్ల్యూ.బి.సి.లు శరీరంలోకి ప్రవేశించిన బాక్టీరియా, వైరసు వంటి  రోగకారక సూక్ష్మక్రిములతో పోరాడి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇక ప్లేటులెట్స్ రక్తం గడ్డకట్టడంలో తోడ్పడతాయి. బోన్‌మారోలో వచ్చే ల్యూకేమియా, మైలోమా కాన్సర్లు సాధారణ ఆర్.బి.సి. – డబ్ల్యూ.బి.సి. – ప్లేట్లెట్ల అభివృద్ధిని దెబ్బదీస్తాయి. ఇందుకు బదులుగా చాలా బ్లడ్ కాన్సర్లలో అసాధారణమైన(కాన్సర్) కణాలు అడ్డూఅదుపు లేకుండా అభివృద్ధిచెందుతాయి. ఆరోగ్యకరమైన రక్తకణాల ఉత్పత్తి నిలిచిపోవటంవల్ల వ్యక్తి తరచూ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. రక్తహీనత కలుగుతుంది. తేలికగా గాయాల పాలవుతారు. లింఫోమా కాన్సర్లలో లింఫ్ నోడ్స్ వాపు ఏర్పడుతుంది. ఇది శరీరం అంటువ్యాధులతో పోరాడే శరీరసామర్థ్యాన్ని క్షీణింపజేస్తుంది.  ఇక మైలోమా కాన్సర్లు ఎముకలను బలహీనపరచే పదార్థాన్నే కాకుండా శరీరంలోని ఇతర భాగాలను నష్టపరచే అసాధారణ ప్రోటీన్లను ఉత్పత్తిచేస్తాయి.

 

బ్లడ్ కాన్సర్ వ్యాధి లక్షణాలు:

బ్లడ్ కాన్సర్లలలో కనిపించే వ్యాధి లక్షణాలు భిన్నంగా  ఉంటున్నాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం అన్నింటిలో సాధరణంగా కనిపిస్తుంటాయి. అవి:

 

జ్వరం, చలి.

తగ్గని అలసట, బలహీనత.

ఆకలి నశించటం, పొట్టలో వికారం

అకారణంగా శరీర బరువు కోల్పోవటం

ఎముకలు- కీళ్లలో నొప్పి

తరచూ ఇన్ఫెక్షన్లకు గురవుతుండటం

శ్వాస ఆడకపోవటం

చర్మం పైన దద్దుర్లు, దురద పెట్టడం

మెడ, చంకలు, గజ్జల వద్ద లింఫ్ నోడ్ల వాపు

 

ఎందువల్ల, ఎవరికి బ్లడ్ కాన్సర్ వస్తుంది?

ఈ ప్రశ్నకు ఒక్క వాక్యంలో సమాధానం చెప్పాలంటే, బ్లడ్ కాన్సర్ ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. అన్ని రకాల బ్లడ్ కాన్సర్లకు కారణం  కణాలలో కొన్ని జన్యువులలో జరిగే పొరపాట్లే. ఇతర కాన్సర్లకు భిన్నంగా బ్లడ్ కాన్సర్లకు కారణమైన వయస్సు పెరగటం వంటి అంశాలపైన మనకు ఎటువంటి అదుపూ ఉండటంలేదు. కొద్దిపాటి మినహాయింపులతో దాదాపు అన్ని బ్లడ్ కాన్సర్లు వచ్చే ప్రమాదం వయస్సు పైబడుతున్న కొలదీ పెరుగుతున్నది. కొన్ని బ్లడ్ కాన్సర్లు స్త్రీలలో ఎక్కువగా ఉంటే మరికొన్ని పురుషులలో అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి వంశపారం పర్యంగా రావటం మాత్రం చాలా అరుదు. కొన్ని సార్లు ఇతర కాన్సర్లకు చికిత్స తీసుకున్న తరువాత, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు కూడా బ్లడ్ కాన్సర్లు వస్తుండటం గుర్తించారు. ఆహారం వంటి జీవనశైలి అంశాలు, రేడియేషన్ వంటి వాతావరణ పరిస్థితులు బ్లడ్ కాన్సర్లకు కారణం అవుతున్నట్లు నిరూపితం కాలేదు. బ్లడ్ కాన్సరుకు గురయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ అనేది కాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు లింఫో బ్లాస్టిక్ ల్యూకేమియా సర్వసాధారణంగా  పిల్లలో కనిపిస్తుంది. ఇక అన్నిరకాల బ్లడ్ కాన్సర్ల సోకే ప్రమాదం వ్యక్తి వయస్సు పెరుగుతున్న కొలదీ పెరుగుతుంది. మొత్తంమీద చూస్తే స్త్రీలలో కంటే పురుషులలో బ్లడ్ కాన్సర్లు అధికం.

చికిత్స అవకాశాలు:

గడచిన కొన్ని దశాబ్దాల కాలంలో బ్లడ్ కాన్సర్ల చికిత్సకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు జరిగాయి. బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ తో బ్లడ్ కాన్సర్లకు తిరుగులేని పరిష్కారం లభించినట్లయ్యింది. అదే సమయంలో మందులుగా ఉపయోగపడ రసాయనిక అణువుల అభివృద్ధి అసాధారణ స్థాయిలో పురోగమించింది. దీంతో కీమోథెరపీ దుష్ఫలితాలను దాదాపుగా నివారించి, వ్యాధి నుంచి ఉపశమనం వేగంగా అందేట్లుగా రూపొందింది. రేడియేషన్ థెరపీ ఇదివరకు ఎన్నడూ లేనంత ఖచ్చితత్వంతో కాన్సర్ కణాలపై కేంద్రీకృతం అయి గరిష్టస్థాయిలో వ్యాధిని కణాలను నిర్మూలించగలుగుతోంది. చికిత్స  కాన్సర్ రకం, వ్యాధిగ్రస్థుడి వయస్సు, కాన్సర్ ఏ భాగంలో ఎంత వేగంగా విస్తరిస్తుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. బ్లడ్ కాన్సర్ల నివారణలో కొన్ని  ప్రధానచికిత్నలు ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి. అవి:

 

స్టెమ్ సెల్ లేదా బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్: బ్లడ్ కాన్సర్ల వల్ల దెబ్బదిన్న బోన్మారోను తొలగించివేసి దానిని స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన  స్టమ్ సెల్స్ ను ప్రవేశపెట్టడమే బోన్‌మారో ట్రాన్సుప్లాంట్. ఈ కణాలు ఎముకలోని బోన్‌మారో స్థలంలో  స్థిరపడి  రక్తకణాలను ఉత్పత్తి చేయటంతోపాటు కొత్త బోన్‌మారో అభివృద్ధికి తోడ్పతాయి. స్టెమ్ సెల్స్(మూల కణాలు) పెట్టడమే ప్రధానమైన ప్రక్రియ కావటం వల్ల బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషనును మూలకణ మార్పిడి శస్త్రచికిత్స అని కూడా అంటుంటారు.

కిమోథెరపీ: పెచ్చుపెరిగిపోతున్న కాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకోగల ఆధునిక ఔషధాలతో చేసే చికిత్స ఇది. బ్లడ్ కాన్సర్లకు సంబంధించి చేసే కిమోథెరపీలో ఒకేసారి వేర్వేరు మందులను ప్రణాళిక ప్రకారం ఇస్తారు. ఇందుకోసం ఇటీవలి సంవత్సరాలలో బ్లడ్ కాన్సర్ కణాలను నిర్మూలించగల అత్యాధునిక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి.

రేడియేషన్ థెరపీ: కాన్సర్ కణాలను చంపివేయటానికి, నొప్పి నుంచి ఉపశమనం కల్పించటానికి రేడియేషనును వాడుతున్నారు. బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయటానికి ముందుగా కూడా రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జలో ఉండే ల్యూకేమియాను, కేంద్రనాడీ మండలంలో ఉండే కాన్సర్ కణాలను నిర్మూలించటానికి ఆధునికమైన రేడియేషన్ చికిత్స అవసరం అవుతుంది. దీనివల్ల మొదట కాన్సరు కణాల పెరుగుదలను అరికట్టగలుగుతారు. తద్వారా ఆ శరీర భాగంలో ఆరోగ్యకరమైన కణజాలం మళ్లీ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

 

అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పెద్ద సంఖ్యలో ఈ ప్రక్రియలను నిర్వహించిన వైద్యనిపుణుల అనుభవం బ్లడ్ కాన్సర్ల అదుపులో కీలకమైన అంశాలుగా రూపొందాయి. ప్రపంచవ్యాప్తంగా మూలకణ మార్పిడి ప్రక్రియను సాధారణంగా ఈ రంగంలో విశేష కృషిచేస్తున్న ఆస్పత్రులు, వైద్యకేంద్రాలలో చేస్తున్నారు. ఇందుకు అవసరమైన వైద్య పరీక్షలు,ట్లాన్స్ ప్లాంటేషన్ ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా వ్యాధిగ్రస్థుడిని తదనంతరం అత్యంత సురక్షిత వాతావరణంలో ఉంచి కోలుకునేట్లు చేయగల ఉత్తమ శ్రేణి వసతులు దీనికి చాలా అవసరం. మూలకణ మార్పిడికి సంబంధించి తమ విభాగంలో అత్యాధునిక ఏర్పాట్లతోపాటు ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న నిపుణులు అందుబాటులో ఉన్నారని యశోద ఆస్పత్రులలోని వైద్యనిపుణులు చెప్పారు.  బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషను కుసంబంధించి ప్రపంచస్థాయి ఏర్పాట్లతో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో  డిపార్ట్ మెంట్ ఆఫ్ హెమటాలజీ, బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ పనిచేస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతోపాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల నుంచి కూడా బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఈ కేంద్రానికి వస్తున్నారు.  చికిత్స కోసం సరైన వైద్యకేంద్రాన్ని ఎంచుకుని అత్యాధునిక రీతిలో చికిత్సను  నిర్వహించగల వైద్యనిపుణుల ఆధ్వర్యంలోనే బ్లడ్ కాన్సరుకు సంబంధించి వేగంగా, అత్యధిక ఉపశమనాన్ని పొందటానకి వీలుకలుగుతుంది.

#

 

డిపార్ట్ మెంట్ ఆఫ్ హెమటాలజీ & బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్

యశోద హాస్సిటల్స్, హైదరాబాద్.

సికిందరాబాదా – సోమాజిగూడ – మలక్ పేట

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s