నిర్లక్ష్యం చేస్తే అధికరక్తపోటు అన్నివిధాల చేటు… ముందుగా గుర్తించి ప్రమాదాన్ని నివారిచేందుకు యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక చికిత్స

downloadమీకు తెలిసివారిలో ఎవరైనా తగ్గని తలనొప్పితో బాధపడుతున్నారా? తరచూ చికాకుగా ఉంటున్నారా? కళ్లు తిరిగుతున్నట్లు అనిపిస్తోందంటున్నారా? ఈ మధ్య ఎపుడైనా ముక్కులోంచి రక్తం కారిందా? కంటి చూపు ఏమైనా మందగించినట్లు అనిపిస్తోందా? వారు అధిక రక్తపోటు (హైపర్టెన్షన్)తో బాధపడుతుండవచ్చు. ఆలస్యం చేయకుండా డాక్టరుకు చూపించండి. చాలా మంది అధిక బి.పి.ని సాధారణ సమస్యగా భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోకుకు గురయ్యే ప్రమాదాన్ని రెండు రెట్లు పెంచుతుంది.  సాధారణ రక్తపోటు ఉన్న వ్యక్తులకన్నా వీరిలో ఈ ప్రమాద అవకాశాలు రెండు వందల శాతం కంటే ఎక్కువ. పైగా హైపర్ టెన్సివ్ గుండెవ్యాధి మరణాలకు, బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి  అధిక రక్తపోటు  మొట్టమొదటి కారణంగా వెల్లడి అయ్యింది.. బి.పి. ఎక్కువగా ఉండటం హార్ట్ ఫెయిల్యూర్, గుండెకండరాలు మందంగా తయారవటం వల్ల వచ్చే లెఫ్ట్ వెంట్రిక్యులార్  హైపర్ ట్రోఫీ, ఇశ్చమిక్ గుండె వ్యాధులకు,  పక్షవాతానికి కూడా దారితీస్తున్నది.

 

రక్తపోటు అంటే ఏమిటి?

గుండె మన శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. అది ధమనుల గుండా ప్రవహించేసమయంలో ఎదురయ్యే వత్తిడి రక్తపోటు. మన రక్తపోటు రీడింగ్ లో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది సిస్టోలిక్ రక్తపోటు(బి.పి. రీడింగ్లో మొదటి అంకె). రెండోది డయస్టోలిక్ రక్తపోటు (బి.పి. రీడింగ్లో రెండో అంకె). గుండె సంకోచించి ధమనులలోకి  రక్తాన్ని నెట్టినపుడు కనిపించే వత్తిడే సిస్టోలిక్ రక్తపోటు. ఆ తరువాత గుండె వ్యాకోచించి దానిలో రక్తం నిండేటపుడు వ్యక్తమయ్యే వత్తిడి డయస్టోలిక్ రక్తపోటు.గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తం ప్రవహించాలంటే కొంత వత్తిడి అవసరమే.  దీనిని సాధారణ(నార్మల్) రక్తపోటు అంటుంటారు. ఆరోగ్యంగా  ఉన్న వయోజనుల రక్తపోటు 120/80లేదా దానికికి దగ్గరగా ఉంటుంది. అది అదుపు తప్పినపుడు సమస్య మొదలవుతుంది.  ఇది  140/90 ఉంటే కొదిపాటి హై బి.పి.గా,  160/100 నుంచి 180/100 ఒక మోస్తరు అధిక రక్తపోటుగా,190/100 నుంచి 180/110 వరకూ ఉంటే తీవ్రమైన హైపర్ టెన్షన్ గా, 200/120 నుంచి 210/120 ఆగ్జిలరేటెడ్(అతి తీవ్రమైన) హైపర్ టెన్షన్ గా  పరిగణిస్తారు.

 

అధిక రక్తపోటు హఠాత్తుగా ఏర్పడే సమస్యకాదు. ఏళ్ల తరబడి నెమ్మదిగా పెరుగుతూవస్తుంది. అనేక సంవత్సరాల పాటు అధికరక్తపోటుతో ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించకపోవటంతో ఆ వ్యక్తి తను హై బిపి తో జీవిస్తున్న విషయం  గుర్తించలేకపోవచ్చు. బి.పి. అతి తీవ్రస్థాయికి పెరిగితే  చిరాకుగా ఉండటం, తరచూ తలనొప్పి, కళ్లు తిరుగుతున్నట్లనిపించటం, కంటిచూపు దెబ్బదినటం వంటి కొన్ని లక్షణాలు బయటపడవచ్చు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే అదృష్టవశాత్తు కొన్ని ప్రాధమిక పరీక్షల ద్వారా  హైపర్ టెన్షనును ముందుగా గుర్తించవచ్చు. డాక్టర్ సలహాలు, చికిత్సతో పూర్తిగా అదుపు చేయవచ్చు.

హై బీపీలో రకాలు:

సాధారణంగా హై బీపీ అన్న పేరు ప్రచారంలో ఉన్నా దీనిలో రెండు రకాలుటాయి. ప్రైమరీ, సెకండరీ హై బి.పి.గా డాక్టర్లు వీటిని విడదీసి చెబుతారు. అత్యధిక వయోజనలలో ఏ ప్రత్యేక కారణం తెలియకుండా వ్యక్తమయ్యే రక్తపోటే ప్రైమరీ అధిక రక్తపోటు. ఇది నెమ్మదిగా సంవత్సరాల తరబడి పెరుగతూ వచ్చిహఠాత్తుగా కనిపిస్తుంది. మరికొంత మందిలో పైకి కనిపించని కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రక్తపోటు పెరుగిపోతుంటుంది. ఇది సెకండరీ హైపర్ టెన్షన్. ఇది కూడా ఒక్కసారిగా వ్యక్తం అయితుంది. అయితే ప్రాధమిక రక్తపోటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన రక్తపోటుకు పలుకారణాలను  డాక్టర్లు గుర్తించారు. అవి: మూత్రపిండాల సమస్యలు, ఎడ్రీనల్ గ్లాండ్ లో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, గురకతో తరచూ నిద్రకు అంతరాయం కలుగుతుండటం(అబస్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా), పుట్టుకతో వచ్చిన రక్తనాళ సమస్యలు, కుటుంబ నియంత్రణ కోసం వాడే మందులు, మితిమీరిన మద్యపానం.

అధిక బి.పి.తో అన్ని అవయవాలకూ ముప్పే

అధిక రక్తపోటు మొదట గుండె, మెదడులను దెబ్బదీస్తుంది. పెరిగిన బి.పి. గుండెకు, మెదడుకు  రక్తాన్ని అందించే ధమనుల పైన వత్తిడిని, కొవ్వు- కొలెస్ట్రాల్ అణువులు పాచిలాగా పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకాలను పెంచుతుంది. ఈ పాచితో ధమనులు పెళుసుగా మారతాయి. వీటికి తోడు అధిక రక్తపోటు శరీరంలోని ఇతర భాగాలపైన కూడా తీవ్రప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వత్తిడితో రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. ఉబ్బిపోతాయి (అన్యురైస్మ్). ఈ ఉబికివచ్చిన ప్రాంతంలో రక్తనాళం చిట్లిపోయినపుడు పరిస్థతి ప్రాణాంతకంగా మారే అవకాశముంది. మూత్రపిండాలలోని రక్తనాళాలు, సూక్మరక్తనాళాలలో పూడికలు ఏర్పడి రక్తప్రవాహం సరిగా జరగక మూత్రపిండాల పనితీరు దెబ్బదింటుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూరుకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా కళ్లలోని సన్నని రక్తనాళాలు కుంచించుకుపోయి దృష్టి దెబ్బదింటుంది. బి.పి. అదుపు తప్పటం వల్ల శరీరధర్మక్రియలలో కూడా విపరీతమైన మార్పులు (మెటబోలిక్ సిండ్రోమ్)వస్తున్నట్లు గుర్తించారు.  రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ శాతం పెరిగి ఆరోగ్యకరమైన హెచ్.డి.ఎల్. కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుంది.

గుండె, మెదడులను ఎలా దెబ్బతీస్తుంది?

కరొనరి ధమనులు పెళుసుగా తయారవటం, ఆ రక్తనాళాలలో అడ్డంకుల  వల్ల రక్తప్రసరణ బాగా తగ్గిపోయి గుండె కండరాలకు తీవ్రమైన పోషకాహారలోటు ఏర్పడుతుంది. మరోవైపు మెదడుకు ఆక్సీజనుతో కూడిన శుద్ధ రక్తం అందించే ధమనులూ దెబ్బదింటాయి. వాటిలో చేరిన పాచి వల్ల రక్తప్రసరణ మార్గం కుంచించుకుపోతుంది. అదే సమయంలో గుండె తగినంత రక్తాన్ని అందించలేకపోతుంది. అధిక రక్తపోటు వ్యక్తి మెదడుపైన చూపే ప్రభావం వల్ల ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి, కొత్తవిషయాలను నేర్చుకోగల సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. రక్తపోటుతో కరొనరీ దమనులు దెబ్బదినటం వల్ల శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేసే దాని శక్తి సాధారణ స్థాయికంటే చాలా తగ్గిపోతుంది. లేదా సంకోచవ్యాకోచాలు జరిపే గుండె  సామర్థ్యం క్షీణిస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ స్థితి ఏర్పడటం వల్ల గుండె ఛాంబర్లలో రక్తం కదలిక తగ్గిపోతుంది. గుండెలో వత్తిడి పెరుగుతుంది. దాంతో  శరీరభాగాలకు ఆక్సీజన్, పోషకాలు ఉన్న రక్తాన్ని సరఫరాచేయటం గుండెకు వల్లకాని పని అవుతుంది. అదే సమయంలో  తగ్గిన తన పంపింగ్ సామర్థ్యాన్ని పూడ్చుకునేందుకు  ప్రయత్నస్తూ  గుండె గదులను వ్యాకోచించి మరింత రక్తాన్ని నింపుకోవటం ప్రారంభిస్తుంది.  ఇది గుండెలో రక్తం కదలికను పెంచుతుంది. కానీ కొద్ది రోజులలోనే కండరాల గోడలు బలహీనపడతాయి. రక్తాన్ని వత్తిడితో పంపింగ్ చేయలేవు.  గుండె శరీర అవసరాలమేరకు రక్తాన్ని నింపుకోలేదు.  ప్రత్యేకించి శారీరకశ్రమ సమయంలో ఇది మరింతగా తగ్గిపోతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.వెరసి తగినంత రక్తం అందక మెదడుభాగాలు  దెబ్బదింటాయి. దానిలోని సూక్ష్మరక్తనాళాలు అధిక రక్తపోటును తట్టుకోలే చిట్లిపోతాయి. ఈ రెండు కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం ఏర్పడుతుంది.

చికిత్స?

సాధారణ పరీక్షలలో అధికరక్తపోటు ఉన్నట్లు తేలినపుడు గుండె, మెదడు పైన దాని ప్రభావం ఏ దశలో ఉందో ముందుగానే గుర్తించేందుకు వెంటనే వైద్యనిపుణులను కలవాలని యశోద ఆస్పత్రులకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ కార్డియాలజీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూరాలజీలకు చెందిన వైద్యులు సూచిస్తున్నారు. తమ వద్ద  24 గంటల పాటు కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టులు అందుబాటులో ఉంటారని, ఎంత మాత్రం ఆలస్యం జరగకుండా రక్తపోటును, దానికారణంగా తలత్తే తీవ్ర సమస్యలను అదుపుచేసేందుకు ఏర్పాట్లు సర్వసిద్ధంగా ఉంటాయని వారు చెప్పారు.  నిర్ధారణ పరీక్షలు చేసి గుండె – మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తినట్లు నిర్ధారణ జరిగితే సమన్వయంతో చికిత్సచేసేందుకు హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్యసౌకర్యాలు ఉన్నాయి.

#

యశోద హార్ట్ ఇనిస్టిట్యూట్

యశోద హాస్పిటల్స్ – హైదరాబాద్.

సికింద్రాబాద్. సోమాజిగూడ.మలక్ పేట్

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s