ఆగంచేసే ఆస్థమా: అదుపు చేసే ఆధునిక వైద్యచికిత్సలు

images_234ప్రపంచవ్యాప్తంగా ముప్పయ్ కోట్ల మందిని  వేధిస్తన్న వ్యాధి ఇది. అస్థమా జీవితకాలం వెంటాడే రుగ్మత. ఇతరత్రా పూర్తి ఆరోగ్యంతో ఉన్నా అనేక మంది కేవలం  ఈ వ్యాధి కారణంగా తమ వృత్తి, ఉద్యోగాలలో అనుకున్నమేరకు కృషిచేయలేక అసంతృప్తికి గురవుతూన్నారు. అస్థమా అంటే ఏమిటి? ఏవయసులో ఇది ప్రారంభమవుతున్నది? అస్థమా వ్యాధి రావటానికి కారణాలు ఏమిటి? ఎందువల్ల ఇది వ్యక్తి ప్రాణలతో చెలగాటం అడగలుగుతోంది? ఈ విషయాలు తెలుసుకుంటే  ఆధునికి చికిత్సను ఎంచుకోవటం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించటం ద్వారా అస్థమాను అదుపుచేసుకుని అది విధించే పరిమితుల నుంచి తేలికగా బయటపడటం సాధ్యపడుతుంది.

ఊపిరి తిత్తులకు ఆక్సీజన్‌తో కూడిన గాలి తీసుకువెళ్లే, వాటి నుంచి కార్బన్ డైయాక్సైడ్ కలిగిన గాలిని వెలుపలికి తీసుకువచ్చే వాయునాళాలకు సోకేవ్యాధి అస్థమా. దీర్ఖకాలంపాటు కొనసాగటంతోపాటు వేర్వేరు సీజన్లలో ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది.అస్థమా సోకినపుడు  వాపుతో వాయునాళాల లోపలి భాగం వాచుతుంది.  వాపు వల్ల ఈ వాయు నాళాలు చాలా సున్నితంగా తయారవుతాయి. తేలికగా అలర్జీలకు గురవుతాయి. వాపు, అలర్జీలతో వాయునాళాలు కుంచించుకుని గాలి వెళ్లాల్సిన స్థలం సన్నగా మారిపోతుంది. ఊపిరి తిత్తులకు వచ్చే, వాటి నుంచి బయటకు వెళ్లే గాలి పరిమాణం చాలావరకు తగ్గిపోతుంది. దీంతో వ్యక్తి ఊపిరి పీల్చినపుడు, వదిలినపుడు కీచు శబ్దం వస్తుంటుంది. చాతీ బరువుగా అనిపిస్తుంది. శ్వాస పీల్చుకోవటంలో సమస్యలతో దగ్గ వస్తుంటుంది. అస్థమా వ్యాధిగ్రస్థులు చాలా వరకు రాత్రిళ్లు, తెలవారుజామున ఈ సమస్యలతో సతమతమవుతుంటారు.

బాల్యంలోనే దాడిచేస్తుంది.
అన్ని వయస్సుల వారు దీనితో బాధపడుతున్నప్పటికీ ఈ వ్యాధి చిన్న వయస్సులోనే ప్రారంభమవుతున్నట్లు గుర్తించారు. మన దేశంలో తీవ్రవైన అస్థమా వ్యాధిపీడితులైన రెండు కోట్ల పైచిలుకు మందిలో దాదాపు ఇరవై శాతం మంది అయిదు నుంచి పదకొండు సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలే. తక్కువ బరువుతో పుట్టిన వారు, ధూమపాన – తీవ్రవాయుకాలుష్యంతోకూడిని వాతావరణలో పెరుగుతున్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నారు. తరచూ శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొవటం, శ్వాసతీసుకునేటపుడు కీచుశబ్దం వంటి లక్షణాలతో అయిదు సంవత్సరాల వయసులో మొదట ఇది బయటపడుతుంది.దీనితోపాటు పిల్లలలో అలర్జీలు, ప్రత్యేకించి చర్మానికి సంబంధించినవి కూడా కనిపిస్తాయి. తల్లిదండ్రులలో అస్థమా ఉన్న పక్షంలో ఆ వ్యాధి పిల్లలకు సంక్రమిస్తున్నది. బాలికలతోపోలిస్తే బాలురలో అస్థమా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. చిన్న వయసులో బాలల వాయునాళాలు బాలికలలో కంటే సన్నవిగా ఉండటం వల్ల వైరల్ వ్యాధులకు వాటితోపాటు గొంతులోంచి కీచు శబ్దం రావటానికి అవకాశం ఏర్పడుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు.
అనేక కారణలు అన్నీ  సాధారణమైనవే!
అలర్జీల మొదలుకుని ఊబకాయం దాకా, అస్థమా వ్యాధి రావటానికి కారణాలు అనేకం. వంశపారంపర్యంగా వచ్చే దానికి ఇవి తోడవటమో లేక కేవలం వీటి కారణంగానే వ్యాధికి గురికావటమో జరుగుతున్నది. ఈ కారణాలు అన్నింటిలోకి అలెర్జీలు, తల్లిదండ్రుల నుంచి సంక్రమించటం ద్వారా మొట్టమొదటి స్థానంలో నిలుస్తున్నాయి. అస్థమాకు సంబంధించి  కొంచం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే ఊబకాయం, గర్భసమయంలో తల్లి అలవాట్లు – ప్రసవాని ఆమె ఎంచుకున్న విధానం కూడా ఈ వ్యాధికి కారణం అవుతున్నాయి.

అలర్జీలు: ఆస్థమా వ్యాధిగ్రస్థులు దాదాపు అందరూ అలర్జీల బాధితులే. అలర్జీలకు మనశరీరం ప్రతిస్పందించే క్రమంలో పెద్దఎత్తున ఆండీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రక్తంలోని ఈ ఆంటీబాడీస్ పెరుగుదల వాయునాళాల వాపునకు, దానివల్ల అస్థమాకు దారితీస్తుంది. పెంపుడు జంతువులు, దుమ్మలోక్రిములు(డస్ట్ మైట్స్), బొద్దింకలు, బూజులు వంటివి ఇళ్లలో అలర్జీలకు కారణం అవుతాయి.

సిగరెట్టు పొగ: తీవ్రవైన అస్థమాకు, పెద్ద సంఖ్యలో అస్థమా మరణాలకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు గుర్తించాయి. గొంతులో కీచు శబ్దం, సాధారణ శ్వాసకోశ వ్యాధులతో మొదలయిన అనారోగ్యం తొందరలోనే అస్థమాగా మారిపోతుంది. ధూమపానం చేసే మహిళల పిల్లలు, పొగతాగే వారికి సమీపంలో అధిక సమయం గడపుతుండే(పాసివ్ స్మోకర్స్) సులభంగా అస్థమా బారిన పడుతున్నారు.

కౌమార్యంలో ధూమపానం: పది నుంచి పదమూడు సంవత్సరా మధ్యకాలంలో పొగతాగటం మొదలు పెట్టిన వారు కూడా ఇటువంటి ప్రమాదాన్నే ఎదుర్కొంటున్నారు.  మితిమీరిన మానసిక వత్తిడి అస్థమాకు దారితీస్తున్నట్ల పరిశోధనలవల్ల తెలిసింది.

మానసిక వత్తిడి: వ్యక్తులలో వత్తిడి పెరుగుదలతోపాటే వారు అస్థమాకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు వారు వత్తిడి నుంచి బయటపడటానికి ధూమపానం వంటి అలవాట్లు కొంత కారణం కావచ్చు. అయితే వత్తిడి కారణంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం అస్థమాకు దారితీస్తున్నట్లు పరిశోధకులు  స్పష్టంచేస్తున్నారు.

ఊబకాయం: బి.ఎం.ఐ. (బాడీ మాస్ ఇండెక్స్) 25 నుంచి 30 మధ్య ఉన్న పెద్దవారికి  ఊబకాయులు కాని అదే వయస్సు వారితో పోలిస్తే అస్థమా వచ్చే అవకాశాలు 38 శాతం ఎక్కువ. బి.ఎం.ఐ. 30కిపైగా ఉన్న ఊబయకాయులైన వయోజనులకు అస్థమా వచ్చే అవకాశాలు వారి వయస్సే ఉన్న ఇతరులతో పోలిస్త్ ఏవకాశాలు 75 శతానికి పైగా ఎక్కువని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయులలో అలర్జిక్ ఆస్థమా కంటే నాన్ అలర్జిక్ అస్థమానే అధికమని పరిశోధకులు చెబుతున్నారు.

గర్భధారణ – ప్రసవం : గర్భవతి ధూమపానం చేయటం వల్ల గర్భస్థ శిశువు శ్వాసవ్యవస్థపైన చెడుప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఆ శిశువుకు అస్థమా వచ్చే అవకాశాలను పెంచివేస్తుంది. పూర్తిగా పెరగకుండానే (ప్రిమెచూర్) జన్మించటం అస్థమా సోకే ప్రమాదాన్ని పెంచుతున్నట్లు గుర్తించారు. గర్భస్థ శిశువు ఈ ప్రపంచంలోకి ప్రవేశించే విధానం కూడా అస్థమాకు కారణం అవుతున్నది. సహజం ప్రసవం ద్వారా పుట్టిన వారితో పోలిస్తే సిజేరియన్ పద్దతిన జన్మించిన వారికి అస్థమా వ్యాధి వచ్చే అవకాశాలు ఇరవై శాతం ఎక్కువ. సిజేరియన్ ప్రసవ సమయంలో నవజాత శిశువు రోగనిరోధక వ్యవస్థను తీవ్రవంగా ప్రభావితం చేసే బాక్టీరియాల దాడిచేయటం ఇందుకు కారణం కావచ్చునని నిపుణులు చెబుతున్నారు.

కలుషిత వాతావరణంతో ప్రమాదం:
ఇళ్లు, కార్యాలయాలు, ఫాక్టరీలలో కలుషి వాతావరణం (ఇండోర్ పొల్యూషన్)అస్థమా వ్యాధికి ముఖ్యకారణాలలో ఒకటి. ఆ పరిసరాలలో  నైట్రస్ ఆక్సైడ్  – సల్ఫర్ డై ఆక్సైడ్- ఓజోన్ -హానికరమైన పొగలు- వంటగ్యాస్,  గది ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం, బూజులు, బాత్రూమ్ క్లీనర్లు, పెయింట్ల వంటివి భవనాలలోని వాతావరణాన్ని అస్థమాకు దారితీసే విధంగా మార్చివేస్తున్నాయి. బయటవాతావరణంలో కాలుష్యం ఎక్కుగా ఉన్న సందర్భాలలో కూడా ఆస్థమా వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బంది పడుతూ ఆస్పత్రులకు వస్తుండటంతోపాటు,ఇతరులు అనేక మందిలో కూడా అస్థమా ప్రారంభ లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. వాహనాల నుంచి వెల్వడే కార్బన్ మోనాక్సైడ్ వంటి పొగలు, ఫాక్టరీల నుంచి వెల్వడే వాయువులు, పొడివాతావరణం వల్ల రేగే దుమ్మ-ధూళి వల్ల ఆస్థమా లేని వారిలో కూడా దగ్గు- శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది- చాతీలో నొప్పి ఏర్పడతాయి. వీటికి  ఇండోర్ పొల్యూషన్ కు తోడయి అస్థమా స్థిరపడే ప్రమాదం ఏర్పడుతుంది. బుతువులతోపాటు వాతావరణంలో వచ్చే మార్పులు కూడా అస్థమా వ్యాధి తీవ్రతను (అస్థమాఎపిసోడ్స్) పెరగటానికి, వివిధ కారణాల వల్ల అప్పటికే అస్థమా రావటానికి అనుకూల వాతావరణం ఏర్పడి ఉన్న వ్యక్తులు అస్థమాకు గురికావటానికి కారణం అవుతున్నాయి. చల్లటి గాలుల వల్ల శ్వాసవ్యవస్థలోని వాయునాళాలు మూసుకుపోవటం (బ్రాంఖోకనిస్ట్రిక్షన్), ఎడతెరపి లేకుండా ముక్కుకారుతూండటం, ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది కలుగుతుంది.

వంశపారంపర్య వ్యాధి

తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పుట్టుకతోనే సంక్రమించే (వంశపారంపర్య) వ్యాధుల్లో అస్థమా  కూడా ఉంది.  అస్థమా వ్యాధిగ్రస్థులో అరవై శాతం మందికి వారి తల్లిదండ్రుల నుంచే వ్యాధి సంక్రమించినట్లు గుర్తించారు. ఈ జన్యువులు వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ పైన, వాయునాళాల వాపు పైన ప్రభావాన్ని చూపించటం అస్థమా వస్తున్నది. తల్లిదండ్రులలో ఒకరికి
అస్థమా ఉన్నా పిల్లలకు ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఆరువందల శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధనలలో తెలియవచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ దాదాపు వంద జన్యువు(జీన్స్)లను గుర్తించగలిగారు. ఇవి వాతావరణంలోని అస్థమా కారక పరిస్థతులతో కలిసి పనిచేస్తుంటాయి. అయితే వంశపారంపర్యంగా వచ్చే అస్థమాకు సంబంధించి ఇంకా అనేక అంశాలు వెల్లడి కావలసి ఉంది. ఇందుకగాను పరిశోధనలు జరుగుతున్నాయి.

అస్థమా అటాక్ సమయంలో ఏ జరుగుతుంది?

అస్థమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోయి, పరిస్థితి తీవ్రంగా తయారవటాన్ని అస్థమా అటాక్ లేదా అస్థమా ఎపిసోడ్ అంటున్నారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్ని సార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది.  అస్థమా అటాక్ జరిగినపుడు శ్వాసవ్యవస్థలో వేగంగా  కొన్ని మార్పులు జరుగుతాయి.

– వాయునాళాల చుట్టుతా కండరాలు  బిగుసుకుంటాయి. దీంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా

కుంచిస్తుంది.

– శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది.

-వాయనాళాల వాపు ఎక్కువయి దారి మరింతగా తగ్గుతుంది.

-వాయునాళాలలోవాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ  ఎక్కువ మూక్యస్

ఉత్పత్తిని ప్రొత్సహిస్తుంది. దీంతో  వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి.

ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకూ  అస్థమా అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ప్రారంభంలో ఊపిరితిత్తులకు కొంచం తక్కువగానైనా ఆక్సీజన్ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావటం కష్టంగా ఉంటుంది.  ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వసకోశాలలో కార్బన్ డైఆక్సైస్ నిలిచిపోయి శరీరంలో ఆక్సీజనుకు కొరత ఏర్పడుతుంది.  క్రమంగా ఉపిరితిత్తులకు అందే ఆక్సీజన్ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సీజన్ తగ్గుతుంది. ఈరకమైన ఆస్థమా అటాక్ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆస్పత్రికి తరలించాలి.

అత్యవసర ఆధునిక వైద్యసేవలే ప్రాణాలు కాపాడతాయి

అస్థమా చికిత్సను నిర్లక్ష్యం చేయటం వల్ల వ్యక్తి జీవితంలోని అన్ని రంగాలలో  నష్టపోవలసివస్తుంది. పిల్లలు తరచూ స్కూలు వెళ్లలేరు.  తగినంతగా పనిచేయలేక, శ్రద్ద చూపలేక పెద్దవాళ్లు వృత్తి ఉద్యోగాలలో వెనుకబడిపోవలసివస్తుంది. శరీరం బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తిగత అభిరుచులు, ఆనందాలకు దూరం కాలవలసి వస్తుంది. అస్థమా జీవిత కాలం వేధించే వ్యాధి  అన్నమాట నిజమే. ఇదివరకటి రోజుల్లో ఈ వ్యాధి వ్యక్తులను పూర్తిస్థాయి రోగులుగా మార్చి వారి కార్యక్రమాలను పరిమితం చేసేది. వైద్య పరిశోధనలు, నూతన చికత్సా విధానాలతో  ప్రస్తతం పరిస్థతి మారిపోయింది. పూర్తి నివారణ ఇప్పటికీ సాధ్యంకాకపోయినా బాధను నివారించే  చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అస్థథా విషమించిన  స్థితిలో అత్యవసర వైద్యసేవలు, నిపుణుడైన డాక్టర్ సహాయం అత్యవసరం. మొదట కృత్రిమంగా శ్వాసఅందిచే ఏర్పాటు చేసి, మందుల ద్వారా వాయునాళాలు తెరిచి సహజంగా ఊపిరి తీసుకునేట్లు చేస్తారు. ఆపైన అస్థమా విషమించటానికి కారణమైన గుర్తించి వాటి నుంచి  కాపాడుకునేందుకు,  మరోసారి అస్థమా అటాక్‌కు గురికాకుండా మందులు – అలవాట్లలో మార్పులను సూచిస్తారు.  దీంతో వాయునాళాలను ప్రేరేపించి అస్థమా అటాక్‌కు దారితీసే పరిస్థతులు, అలవాట్లకు దూరంగా ఉండే పద్దతులు  తెలిసివస్తాయి.  నిపుణులైన వైద్యుల సూచనలను పాటిస్తూ, క్రమం తప్పని పరీక్షలు – పర్యవేక్షణతో  అస్థమా వ్యాధిగ్రస్థులు సాధారణ జీవితం గడపటానికి వీలు కలుగుతున్నది.

 

ముందు జాగ్రత్తలతో ఆస్థమా పై అదుపు

అస్థమా ఓ సంక్లిష్టమైన వ్యాధి. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులు-పరిసరాలలో వ్యాధిని ప్రేరేపించే అంశాల కలయిక వ్యాధికి దారితీస్తున్నదని పరిశోధనలలో తేలింది. జన్యువుల వల్ల సంక్రమించగలిగినా పరిసర వాతావరణం ఇందులో చాలా ముఖ్యమైన పాత్రవహిస్తున్నందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవటం  ద్వారా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారితో సహా ఇతరులూ ఈ వ్యాధిబారిన పడకుండా చూసుకునేందుకు వీలుకలుగుతుంది. అస్థమా వ్యాధిని నిరోధించటం ఓ సవాలు. వైద్యనిపుణులు ఇందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

 

  1. దిండ్లపై దుమ్ము, ధూళి లేకుండా చూసుకొండి. కనీసం పదిహేను రోజులకు ఓ సారి పక్కబట్టలను

మరుగుతున్న నీళ్లతో ఉతకండి.

  1. పెంపుడు జంతువులను పడకగదిలోకి, ఫర్నీచర్ పైన కూర్చోవటానికి అనుమతించకండి.
  2. పడక గదిలో కార్పెట్లు వేయకండి. దూదికూరి చేసిన పిల్లల బొమ్మలను పడకగదుల్లో పెట్టకండి.
  3. ఇంటి వాతావరణంలో తేమ అధికంగా ఉండకుండా చూసుకొండి. ఇంటిలోకి వస్తున్న గాలి నాణ్యతను

గమనిస్తూ ఉండండి

  1. ధూమపానం కోసం ఉద్దేశించిన ప్రదేశాలకు దూరంగా ఉండండి.
  2. ఇళ్లలో ఫ్లోరింగ్, బాత్రూమ్ లను శుబ్రం చేసేందుకు ఘాటైన క్లీనర్లను, ఆసిడులను వాడకండి.
  3. మానసిక వత్తడిని అదుపులో ఉంచుకొండి.
  4. తీవ్రమైన చలి, వేడి ఉన్న రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయకండి.
  5. అస్థమా లక్షణాలు కనిపించినపుడు  ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు

చేయించుకొండి. ప్రారంభంలోనే వైద్యులను కలవటం వల్ల మీ అస్థమాకు కారణాలను గుర్తించి చికిత్స

చేయటం – జాగ్రత్తలను సూచించటం ద్వారా దానిని పూర్తగా అదుపులో ఉంచటానికి వీలవుతుంది.

 

#

డిపార్ట్ మెంట్ ఆఫ్ పల్మనాలజీ

యశోద హాస్పిటల్స్

సికిందరాబాద్ – సోమాజిగూడ – మలక్ పేట్.

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s