మూలకణ చికిత్సతో కొత్త జీవితం… బ్లడ్ కాన్సరుకు బోనుమారో మార్పిడితో సమాధానం

 

67716-004-C53DF929ప్రముఖ భవననిర్మాణ సంస్థలో  సైట్ ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రసన్న(29)కు ఈ మధ్య చాలా నీరసంగా అనిపిస్తోంది. తరచూ జ్వరం వస్తోంది. కంపెనీ డాక్టర్ల సూచనమేరకు కొన్ని వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. అవి చూసిన వైద్యులు ఆ యువకుడికి బ్లడ్ కాన్సర్ (ల్యుకేమియా)ఉన్నట్లు నిర్ధారించి చెప్పారు.ఉత్సాహవంతుడు, కష్టపడి పనిచేసేవాడిగా గుర్తింపు పొంది ఆ జాతీయస్థాయి నిర్మాణ సంస్థలో ఉన్నత స్థాయికిచేరగల అవకాశం ఉందని అందరూ విశ్వసిస్తున్న సమయంలో ఈ పరిమాణంతో ప్రసన్నకు తాను ఒక్కసారిగా లోయలోకి జారిపడినట్లు అనిపించింది. అయితే తమ కంపనీ డాక్టర్ల సూచనమేరకు సూపర్ స్పెషాలటీ వైద్యనిపుణులను కలిసి మాట్లాడటం అతనిలోని విషాధాన్ని పూర్తిగా తుడిచి వేసింది. బ్లడ్ కాన్సరుకు ఇపుడు బోన్‌మారో ట్రాన్స్ ప్లాంట్ లాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, దానితో సాధారణ జీవితం గడపటం సాధ్యమని  వైద్యనిపుణు చెబుతున్నారు. రక్తకాన్సర్ తోపాటు లింఫోమా, మల్టిపుల్ మైలోమా, బోన్ మారో దెబ్బదిన్న సందర్భాలలో కూడా ఈ విధానం కొత్త జీవితాన్ని ప్రసాధించగలుగుతుంది.

 

మనశరీంలోని కొన్ని పొడవైన తొడ, తుంటి ఎముకలలో ఉండే కొవ్వుతో కూడిన మొత్తటి స్పాంజిలాంటి పదార్థమే బోనుమారో(ఎముక మజ్జ). దీనిలో పరిక్వత చెందని కణాలు, స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇవి జీవితకాలంపాటు స్టెమ్ సెల్స్ లాగా ఉండ గలవు.  అదే విధంగా  ఎర్రరక్త కణాలు (ఆర్.బి.సి.), తెల్లరక్తకణాలు(డబ్ల్యూ.బి.సి.), ప్లేట్ లెట్స్ గా  అభివృద్ధి చెందగలవు కూడా.  రక్తంలోని  ఆర్.బి.సి. కణాలే శరీరంలోని అన్ని అంగాలు, వాటిలోని కణాలకు ఆక్సీజనును అందజేస్తుంటాయి. డబ్ల్యూ.బి.సి.లు శరీరంలోకి ప్రవేశించిన బాక్టీరియా, వైరసు వంటి  రోగకారక సూక్ష్మక్రిములతో పోరాడి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇక ప్లేటులెట్స్ రక్తం గడ్డకట్టడంలో తోడ్పడతాయి.

 

బోన్‌మారో ట్రాన్సుప్లాంట్ అంటే ఏమిటి?

అంటువ్యాధులు, కీమోథెరపీ, వివిధ రకాల తీవ్ర వ్యాధుల వల్ల దెబ్బదిన్న బోన్మారోను తొలగించివేసి దానిని స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన  స్టమ్ సెల్స్ ను ప్రవేశపెట్టడమే బోన్‌మారో ట్రాన్సుప్లాంట్. ఈ కణాలు ఎముకలోని బోన్‌మారో స్థలంలో  స్థిరపడి  రక్తకణాలను ఉత్పత్తి చేయటంతోపాటు కొత్త బోన్‌మారో అభివృద్ధికి తోడ్పతాయి. స్టెమ్ సెల్స్(మూల కణాలు) పెట్టడమే ప్రధానమైన ప్రక్రియ కావటం వల్ల బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషనును మూలకణ మార్పిడి శస్త్రచికిత్స అంటున్నారు. ఈ వైద్య ప్రక్రియకు కావలసిన ఆరోగ్యకరమైన మూలకణాలు దాత నుంచి సేకరించవచ్చు. లేదా కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి నుంచే ముందుగా సేకరించి సంరక్షించినవి కావచ్చు. కాన్సర్ వ్యాధిగ్రస్థులకు కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స ప్రారంభించేందుకు ముందు ఆ వ్యక్తి ఎముకల నుంచి మూలకణాలను సేకరించి అభివృద్ధి చేస్తారు. ఆపైన రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయిన తరువాత బోన్‌మారో ట్రాన్స్ ప్రాంటేషన్ చేస్తారు.

 

ఎవరికి, ఎందుకు అవసరం అవుతుంది?

కొంత మందిలో బోన్‌మారో తన ప్రధాన విధి అయిన రక్తకణాలను ఉత్పత్తి చేయటంలో విఫలం అవుతుంది. దీనిని వైద్య పరిభాషలో ఎప్లాస్టిక్ ఎనీమియా అంటున్నారు.  వీరిలో మళ్లీ సహజంగా రక్తకణాల ఉత్పత్తికి మూలకణ మార్పిడి ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదే విధంగా ల్యుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి కాన్సర్లు ఉన్నపుడు, కిమోథెరపీ వల్ల బోన్‌మారో పుర్తిగా దెబ్బదిన్నప్పుడూ మూలకణ మార్పిడి అనివార్యం అవుతుంది. ఎక్కవ మొత్తాలలో కీమోథెరపీ, రేడియేషన్ తో చికిత్స అనంతరం మూలకణమార్పిడి చేస్తారు.

 

మూలకణ మార్పిడిలో రకాలు:

ఎందుకోసం మార్పిడి చేయాల్సి వస్తున్న దానిని బట్టి ఈ బోన్మరో ట్రాన్స్ ప్లాంటేషన్ మూడు రకాలు ఉన్నాయి. ఆటోలోగస్ లేదా రిస్క్యూ బోన్‌మారో ట్రన్స్ ప్లాంటేషన్, రెండోది అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్. మూడో పద్దతి అబ్లికల్ ఖార్డ్ బ్లడ్ ట్రాన్స్ ప్లాంట్.   రెస్క్యూ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ లో  ఒక వ్యక్తికి స్వంత స్టెమ్ సెల్స్ తో చికిత్స చేస్తారు. ఇందుకోసం ముందుగానే ఆ వ్యక్తి ఎముకల నుంచి

మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిని బయట అభివృద్ధిపరచి మార్పిడికి సిద్దంచేస్తారు.  రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు పూర్తయిన తరువాత వాటితోనే ఆ వ్యక్తి బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తారు. అంటే వ్యక్తి మూల కణాలే తిరిగి అతని చేరతాయి. అయితే ఇది అన్నిసందర్భాలలో సాధ్యం కాదు. వ్యక్తి బోన్‌మారో ఆరోగ్యకరమైనదిగా ఉండి కాన్సర్ చికిత్సకు వచ్చిన సందర్భంలో మూలకణాలను ముందుగానే సేకరించి కీమో, రేడియేషన్ కొనసాగినంత కాలం వాటిని బయట అభివృద్ధి పరచవచ్చు. దీనిలో మూలకణాల మార్పిడి వల్ల ఎటుంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.

 

అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రెస్క్యూ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ వీలుకాని పరిస్థతులలో మరో వ్యక్తి నుంచి సేకరించిన మూల కణాలతో ఈ ప్రక్రియను నిర్వహించాల్సి వస్తుంది. ఆ విధంగా దాత నుంచి తీసుకున్న స్టెమ్ సెల్స్ తో చేసిన మార్పిడిని  అల్లోజెనిక్ బోన్‌మారో ప్లాంటేషన్ అంటారు. ఇందులో దాత మూలకణాలు స్వీకరించే వ్యక్తికి జన్యురీత్యా సంబంధికులై ఉండాలి. చాలా సందర్భాలలో దగ్గరి బంధువులు దాతలవుతారు. కానీ జన్యురీత్యా సరిపడే బయటి వ్యక్తులు కూడా  ఉపయోగపడతారు. వ్యక్తిలోని బోన్ మారో చెడిపోయి పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు అల్లోజెనిక్ పద్దతి ఆదుకుంటుంది. అయితే దీనిలో జి.వి.హెచ్.డి. (గ్రాఫ్ట్ వైరస్ హోస్ట్ డిసీజ్ ) వంటి కొన్ని సమస్యలు, ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. అదేసమయంలో మార్పిడి ద్వారా దాత నుంచి  వచ్చిన మూలకణాలను స్వీకర్త శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు ఇమ్మ్యూనో సప్రెసివ్ మందులను ఇస్తారు. ప్రాణరక్షణ ప్రక్రియ అయిన మూలకణ చికిత్స కొన్ని సమస్యలతో వైద్యులకు సవాలు విసురుతున్నది.

బి.పి. తగ్గటం, వికారంగా అనిపించటం, చలితో కూడిన వణుకు, కొంత మందిలో జ్వరం వంటివి కనిపిస్తాయి. అయితే ఇవన్నీ స్వల్పకాలం మాత్రమే ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. మొత్తం మీద అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతం కావటం  దాత మూలకణాలు స్వీకర్త మూలకణాతో సరిపడటం మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది.

 

అంబ్లికల్ ఖార్డ్ బ్లెడ్ ట్రాన్స్ ప్లాంట్ కూడా దాత పైన ఆధారపడే అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ లాంటిదే. అయితే దీనిలో నవజాత శిశువు బొడ్డతాడు(అంబ్లికల్ ఖార్డ్) నుంచి మూలకణాలను సేకరించి వాడతారు. బిడ్డపుట్టగానే స్టెమ్ సెల్స్ సేకరించి అతిశీతల వాతావరణంలో నిలువచేస్తారు. ట్లాన్స్ ప్లాంటేషన్ అవసరమైనపుడు బయటకు తీసి ఉపయోగిస్తారు. దీనిలోని రక్తకణాలు అపరిపక్వమైనవి. ఇవి  మూలకణ మార్పిడికి చాలా అనుకూలమైనవి. అయితే స్టెమ్ సెల్స్ తక్కువగా ఉండటం వల్ల స్వీకర్త పూర్తిగా కోలుకోవటానికి కొంత ఎక్కువ సమయం అవసరమవుతుంది.

 

స్టెమ్ సెల్స్ ను ఎలా సేకరిస్తారు?

ఇందుకు రెండు పద్దతులు అనుసరిస్తున్నారు. మొదటి పద్దతిలో తొడ, తుంటి ఎముకల నుంచి నేరుగా మూలకణాలను సేకరిస్తారు.ఇందుకోసం ముందుగా వ్యక్తికి నొప్పితెలియకుండా మత్తుమందు ఇస్తారు. ఓ బలంగా ఉన్న పొడవైన సూదిని ఉపయోగించి స్టెమ్ సెల్స్ ను సేకరిస్తారు. రెండో పద్దతిలో  మూలకణ దాతకు అయిదు ఇంజక్షన్లు ఇస్తారు. దాంతో ఎముకలలోని స్టెమ్ సెల్స్ రక్తప్రవాహంలోకి వస్తాయి. అపుడు సిరల లోంచి రక్తాన్ని తీసుకుంటారు. ఓ యంత్రం సాయంతో ఆ రక్తంలోని తెల్లరక్తకణాలను వేరుచేసి సేకరిస్తారు. వాటితోపాటే మూలకణాలు ఉంటాయి. ఇక బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేపట్టడానికి ముందు కొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కాన్సర్ వ్యాధిగ్రస్థుడిలో ఎటువంటి బోన్‌మారో ఉన్నదో ఖచ్చితంగా తేల్చుకుంటారు. రెడియేషన్ లేదా కిమోథెరపీ ద్వారా బోన్‌మారో కాన్సర్ సోకిన కణాలను పూర్తిగా నిర్మూలిస్తారు. బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తవటానికి వారం రోజులు పడుతుంది. ఈ చికిత్స సమయంలో రోగనిరోధక వ్యవస్థ కొంత బలహీనపడుతుంది. తేలికగా అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో ఉంచి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తారు.

ఆ పైన కూడా దాదాపు నెల రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతుంది.

 

మూలకణ మార్పిడి ఎలాచేస్తారు?

ప్రపంచవ్యాప్తంగా మూలకణ మార్పిడి ప్రక్రియను సాధారణంగా ఈ రంగంలో విశేష కృషిచేస్తున్న ఆస్పత్రులు, వైద్యకేంద్రాలలో చేస్తున్నారు. ఇందుకు అవసరమైన వైద్య పరీక్షలు,ట్లాన్స్ ప్లాంటేషన్ ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా వ్యాధిగ్రస్థుడిని తదనంతరం అత్యంత సురక్షిత వాతావరణంలో ఉంచి కోలుకునేట్లు చేయగల ఉత్తమ శ్రేణి వసతులు దీనికి చాలా అవసరం. మూలకణ మార్పిడికి సంబంధించి తమ విభాగంలో అత్యాధునిక ఏర్పాట్లతోపాటు ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న నిపుణులు అందుబాటులో ఉన్నారని యశోద ఆస్పత్రులలోని వైద్యనిపుణులు చెప్పారు.  బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషను కుసంబంధించి ప్రపంచస్థాయి ఏర్పాట్లతో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో  డిపార్ట్ మెంట్ ఆఫ్ హెమటాలజీ, బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ పనిచేస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతోపాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల నుంచి కూడా మూలకణ మార్పిడికోసం ఈ కేంద్రానికి వస్తున్నారు.

 

వ్యక్తి మూలకణ మార్పిడికి పూర్తి సిద్దంగా ఉన్నారు అని డాక్టర్ నిర్ధారించుకున్న తరువాత అందుక ఏర్పాట్లుచేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు రక్త ఎక్కించటం లాగానే ఉంటుంది. అల్లోజెనిక్ బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ అయిన సందర్భంలో దాత నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ను అభివృద్ధి చేసి మార్పిడికి ఒకటి రెండు రోజుల ముందే సిద్దంగా ఉంచుకుంటారు. సెంట్రల్ వీనస్ కాథటర్ అనే సూదిని చాతీపైన కుడిపైన కుచ్చి పెడతారు. మూలకణమార్పిడి కొద్ది రోజుల పాటు సాగే ప్రక్రియకావటం వల్ల ఈ సూదిని ఓ వారం రోజులపాటు అక్కడ అలాగే  ఉంచుతారు. ఆరోగ్యకరమైన, కొత్త మూలకణాలను దీని ద్వారా నేరుగా గుండెలోకి ప్రవేశపెడతారు.

ఆ స్టెమ్ సెల్స్ అక్కడి నుంచి బోన్మారోతోసహా శరీరమంతా వ్యాపిస్తాయి. బోన్‌మారోలో స్థిరపడిన మూలకణాలు అక్కడ పెరిగటం ప్రారంభిస్తాయి. ఈ విధంగా దాదాపు వారం రోజులలో  పలుసార్లు మూలకణాలను ప్రవేశపెట్టడం వల్ల అవి కొత్త వ్యక్తి శరీంతో సర్దుబాటుచేసుకుని అభివృద్ధి చెందేందుకు వీలుకలుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను ఎన్ గ్రాఫ్ట్ మెంట్ అంటారు. బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ సమయంలో అవసరమైన ఇతర మందులు ఇవ్వటానికి, అవసరమైతే రక్తం ఎక్కించటానికి, కొత్త మూలకణాలను శరీరం తిరస్కరించ(రిజెక్ట్)కుండా చూసేందుకు ఇమ్మ్యూనో సప్రెసెంట్లను ఇవ్వటానికి కూడా చాతీ పైన అమర్చిన కాథటర్ ఉపయోగపడుతుంది.

 

మూలకణ మార్పిడి తరువాత పరిస్థితి ఏమిటి?

ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తయిన తరువాత కొంతకాలం పాటు పరిస్థతిని డాక్టర్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు. మార్పిడి జరిగిన తరువాత పది రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకూ అబ్జర్వేషన్ కొనసాగుతుంది. మూలకణ మార్పిడి తరువాత కనిపించే మొట్టమొదటి మార్పు రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య భారీగా పేరుగుతుంది. శరీరరక్ష వ్యవస్థలో భాగమైన తెల్లరక్త కణాల ఉత్పత్తి జరుగుతుండటం ట్రాన్స్ ప్లాంటేషన్ పనిచేస్తోందనటానికి ఇది ఒక నిదర్శనం. సాధారణంగా మూలకణ మార్పిడి ప్రక్రియ నుంచి వ్యక్తి కోలుకోవటానికి  మూడు నెలల సమయం పడుతుంది. పూర్తిగా కోలుకోవటానికి దాదాపు ఏడాది అవసరమవుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దాత, స్వీకర్తల కణాల మధ్య సహజ సయోధ్య ఏర్పడటం ఈ ప్రక్రియ విజయానికి ప్రాధమిక ఆధారం అవుతుంది. ఆపైన రేడియోషన్, కిమోథెరపీ, ఏ సందర్బంలో ఎక్కడ ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందన్న వాటి ప్రభావమూ ఉంటుంది. బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ వ్యక్తి పై జీవితకాలం ప్రభావం చూపగల అంశం. ప్రక్రియలో సూటితనాన్ని సులభమైనదిగా భావించి ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తీవ్రవంగా ఉంటాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియకు సంబంధించి అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పెద్ద సంఖ్యలో ఈ ప్రక్రియలను నిర్వహించిన వైద్యనిపుణుల అనుభవం రెండూ కీలకమైన అంశాలుగా రూపొందాయి.

#

 

డిపార్ట్ మెంట్ ఆఫ్ హెమటాలజీ & బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్

యశోద హాస్సిటల్స్, హైదరాబాద్.

సికిందరాబాదా – సోమాజిగూడ – మలక్ పేట

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s