బరువు తగ్గుతుంది…ఆనారోగ్యం వదులుతుంది బేరియాట్రిక్ సర్జరీలు సురక్షితం, ఖచ్చితం

Bariatric-Surgeryవిష్ణువర్ధన్(47) వ్యాపారవేత్త. భోజన ప్రియుడు. నూట ఇరవై ఆరు కిలోల శరీర బరువుతో నడవటం కష్టంగా ఉండి గడచిన ఏడాదిలో ఎక్కువగా తన కార్యాలయానికే పరిమితమయ్యారు. కొన్ని నెలల కాలం వ్యాపారానికి  దూరంగా ఉండి ఇటీవలే తిరిగి ఆఫీసుకు వెళ్లినపుడు సిబ్బంది, తనను కలిసేందుకు చ్చిన సిబ్బంది, కస్టమర్లు ఆయనను చూసి ఆశర్యపోయారు. దాదాపు 20 సం.ల వయస్సు తగ్గినట్లు సన్నగా, ఉత్సాహంతో కనిపించాడు. మీరు వ్యాపారంలోకి ప్రవేశించిన తొలినాళ్లల నాటి ఉత్సహం మళ్లీ కనిపిస్తున్నదని వారంతా అభినందించారు. అప్పటికే దాదాపు దశాబ్ధ కాలంగా వ్యాయామం, డైటింగ్ తో ప్రయత్నించివీ పెద్దగా ప్రయోజనం కనిపించని స్థితితలో ఆయన శరీరబరువు తగ్గించే (బేరియాట్రిక్) సర్జరీ చేయించుకున్నారు. ఈ మధ్యవయస్సు వ్యాపారవేత్త ఎదుర్కొన్నది అరుదైన ఆరోగ్య సవాలు ఏమీ కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జనాభాలో 20శాతం (దాపు 2.2 కోట్ల మంది) ఎదుర్కొంటున్నదే. అయితే  ఊబకాయులలో అత్యధికులుకు భిన్నంగా  అపోహలు – అనుమానాలను తోసిపుచ్చి   సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించటం వల్ల ఆయన పెద్ద ముందడుగు వేశారు.

అదుపు తప్పిన శరీర బరువు వివిధ అవయవాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.  తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఆయుప్రమాణాన్ని తగ్గించివేస్తున్నది.మితిమీరిన శరీర బరువు వల్ల టైప్ -2 డయాబెటిస్(మధుమేహం), గుండెవ్యాధులు, నిద్రలో శ్వాససమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్నిరకాల కాన్సర్లు వస్తున్నాయి. మనదేశంలో ఊబకాయం, దాని వల్ల తలెత్తుతున్న సమస్యల కారణంగా ఏటా 30 నుంచి 40 లక్షల మంది మరణిస్తున్నారు. మితిమీరిన శరీర బరువుగల వయోజనులు, పిల్లల విషయంలో  అమెరికా(సంయక్తరాష్ట్రాలు), చైనా తరువాతి(మూడో) స్థానం మనదేశానిదే. ఒక అంచనా ప్రకారం దాదాపు అయిదు కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతున్నారు

వ్యక్తి పొడవు, శరీరపు బరువు ఆధారంగా లెక్కించే బి.ఎం.ఐ.(బాడీ మాస్ ఇండెక్స్)ను బట్టి ఊబకాయాన్ని, దాని తీవ్రతను అంచనా వేస్తారు.  ఈ బి.ఎం.ఐ. 25 కి.గ్రా/ఎం2 నుంచి 30కి.గ్రా /ఎం2 వరకూ ఉంటే అధిక బరువు(ఓవర్ వెయిట్)గా పేర్కొంటారు. అది 30కి.గ్రా /ఎం2 దాటితే ఊబకాయం(ఒబెసిటీ)గా పరిగణిస్తారు.

తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీర బరువును తగ్గించేందుకు ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన వైద్యపరమైన పరిష్కారం బరువు తగ్గించే(బేరియాట్రిక్) సర్జరీలు. ఇటీవలి సంవత్సరాలలో కొందరు ప్రముఖులు ఈ ఆపరేషన్లు చేయించుకుని అకాల మరణం పొందటంతో దీనికి సంబంధించి పలువురిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భయాలు వ్యక్తం అవుతున్నాయి. శరీర బరువును తగ్గించే శస్త్రచికిత్సలు ఎన్ని రకాలు? ఇవి ఎవరికి అనువైనవి? వీటి ప్రయోజనాలు, పొంది ఉండే ప్రమాదాలు ఏమిటి? తెలుసుకోవటం ద్వారా మితిమీరిన శరీర బరువు వల్ల వచ్చే సమస్యలుకు ఆధునిక వైద్యం అందిస్తున్న చికిత్స నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందగలుగుతాం.

అధిక బరువును తగ్గించే సర్జరీలు

ఊబకాయాన్నుంచి విముక్తి సర్జన్లు నాలుగు రకాల శస్త్రచికిత్సల అందుబాటులో ఉన్నాయి. ఈ నాలుగింటిలో దేనికి అదే ప్రత్యేకమైనది. వ్యక్తి ఎదుర్కొంటున్న బరువు సమస్య, జీవనశైలిని బట్టి వారికి సరిపడగల సర్జరీని సర్జన్లు సిఫార్సుచేస్తున్నారు. బరువు తగ్గించే సర్జరీలను లాప్రోస్కోపిక్, మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతులలో శస్త్రచికిత్స చేసేందుకు తమ బేరియాట్రిక్ క్లినిక్ లో

అత్యాధునిక సౌకర్యాలు, సుదీర్ఘ అనుభవం గల సర్జన్లు ఉన్నారని యశోద హాస్పిటల్స్ కు చెందిన వైద్యనిపుణులు తెలిపారు. ఊబకాయాన్ని అదుపుచేయటానికి పెరుబడ్డ సర్జరీలను గూర్చి వారు వివరించారు.

లాప్రోస్కోపిక్ గాస్ట్రిక్ స్లీవ్ రీసెక్షన్ (ఎల్.జి.ఎస్.ఆర్.): ఇది శస్త్రచికిత్స ద్వారా జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించి వేయటం ద్వారా దాని పరిమాణాన్ని కుదించే ప్రక్రియ. దీనిలో జీర్ణాశయం ప్రధాన వంపు నుంచి కొంత భాగాన్ని కోసి తీయటం ద్వారా మొత్తం మీద పొట్ట పరిమాణాన్ని 20-30 శాతం తగ్గిస్తారు. ఈ ఆపరేషన్ తరువాత జీర్ణాశయం అరటి పండు ఆకారంలో ఉండే  ఓ గొట్టం లాగా కనిపిస్తుంది. అంటే ఎల్.ఎ.జి.బి. కి భిన్నంగా ఇది పొట్టసైజును శాశ్వతంగా తగ్గించివేసే శస్త్రచికిత్స అన్నమాట.

రౌక్స్ – ఎన్ – వై గాస్ట్రిక్ బైపాస్: గాస్ట్రిక్ బైపాస్ లో జీర్ణాశయం పరిమాణాన్ని తగ్గించటంతోపాటు ఆహారం 3-5 అడుగుల మేరకు ప్రేవును వదిలి ముందుకు వెళ్లేట్లు చేస్తారు. ఈ శస్త్రచికిత్స తరువాత పేషంట్ ఇదివరకంత మొత్తంలో ఆహారం తీసుకోలేరు. మరోవైపు బైపాస్ (ప్రేవులో కొంత భాగాన్ని వదిలి ముందుకు వెళ్లటం) వల్ల శరీరం ఆహారంలోంచి కాలరీలను మొత్తంగా స్వీకరించలేదు.

లాప్రోస్కోపిక్  అడ్జెస్టబుల్ గాస్ట్రిక్ బాండింగ్ (ఎల్.ఎ.జి.బి):  ఈ శస్త్రచికిత్సలో జీర్ణాశం పై భాగన సర్జన్ ఓ చిన్న (సిలికాన్)బాండ్ వేస్తారు. దీంతో పొట్ట పరిమాణం తగ్గి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోగానే నిండిపోతుంది. బాండ్ వల్ల ఆ వ్యక్తి తినే ఆహారం పరిమాణం తక్కువగా ఉండగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఆ విధంగా తక్కువ ఆహారం రూపంలో శరీరానికి అందేకాలరీలు తగ్గిపోతాయి.

డుయోడినల్ స్విచ్:

దీనినే బైలోపాంక్రియాటిక్ డైవర్షన్ విత్ డుయోడినల్ స్విచ్ అని కూడా అంటున్నారు. ఇది తక్కి బేరియాట్రిక్ సర్జరీలకంటే కిష్టమైనది. దీనిలో రెండు వరేర్వేరు శస్త్రచికిత్సలు చేస్తారు. వీటిలో మొదటి గాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ లాగే ఉంటుంది. ఇక రెండవది వ్యక్తి తీసుకున్న ఆహారం చిన్నపేవులోని చాలా బాగాన్ని దాటేసి నేరుగా వెళ్లేట్లు  చేస్తుంది. అయితే ఈ విధంగా వచ్చిన ఆహారం చిన్నపేవు చివరి భాగంలో జీర్ణరసాలు కలిసే ప్రాంతానికి చేరేట్లు జాగ్రత్త పడతారు. తక్కిన మూడు రకాల శస్త్రచికిత్సలతో పోలిస్తే ఇది అధికంగా శరీర బరువును తగ్గించుకునేందుకు సాయపడతుంది. అయితే ఈ శస్త్రచికిత్సలో సమస్యలు కూడా అధికమే. బేరియాట్రక్ సర్జరీ చేయించుకున్న వారిలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ల కొరత ఏర్పడినట్లు గుర్తించారు. అందువల్ల సర్జన్లు ఈ ఆపరేషన్ న అంతగా సిఫార్సుచేయరు.

బరువు తగ్గించే సర్జరీల వల్ల ప్రయోజనం?

  • తక్కుసమయం (ఆరు నెలల నుంచి ఏడాది)లో శరీర బరువు గణనీయంగా తగ్గుతుంది.
  • టైప్ -2 మధుమేహం, రక్తపోటు అదుపులో మెరుగైన ఫలితాలు.
  • రక్తంలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ (ఎల్.డి.ఎల్.)పరిమాణం తగ్గుతుంది.
  • తుంటి, మోకాలు కీళ్ల నొప్పి తగ్గుతుంది.
  • నిద్రలేమి, వళ్లు నొప్పులు తగ్గి  వ్యక్తి జీవన నాణ్యత మెరుగుపడుతుంది.

వ్యక్తి శరీరం ఈ ఆపరేషనుకు అనుకూలంగా ఉందన్న అంశాన్ని నిర్ధారించు కోవటంతో సహా కొన్నిఖచ్చిమైన నిబంధనలకు లోబడి మాత్రమే  శరీరం బరువును తగ్గించే శస్త్రచికిత్సలను సిఫార్సుచేస్తారు. ఇందుకుగాను సర్జన్లు బేరియాట్రిక్ సర్జరీ కోసం వచ్చిన వ్యక్తి బి.ఎం.ఐ. 30కి.గ్రా /ఎం2 దాటి ఉన్నదా ముందుగా నిర్ధారించుకుంటారు. ఆపైన వ్యక్తి వయస్సు, సాధారణ ఆరోగ్య పరిస్థి శస్త్రచికిత్సకు అనుకూలమేనా చూస్తారు. ఇందుకోసం యశోద హాస్పిటల్స్ కు చెందిన  బేరియాట్రిక్ క్లినిక్ లో పేషంట్లకు ఉచితంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు. సందేహాలకు సమాధానాలు ఇవ్వటంతోపాటు  అదనపు బరువును వదిలించుకునే ప్రయత్నం విజయవంతం కావటానికి పేషంటుకు అవసరమైనమైన పట్టుదల ఉందా తెలుసుకుంటారు. ఈ అంశాలు సరిచూసుకున్న తరువాత పేషంటు ఆరోగ్యస్థితి, జీవనశైలి, ఊబకాయపు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారికి అనువైన శస్త్రచికిత్సను సిఫార్సుచేస్తామని యశోద హాస్పిటల్స్ వైద్యనిపుణులు తెలిపారు.

#

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s