జీవితంలో తీయ్యదనాన్ని హరించే షుగర్ వ్యాధి…  వెంటనే జాగ్రత్తపడితే డయాబెటిస్ పై పూర్తి అదుపు

 

diabetesశ్రీరామ్(49) అడ్వర్టైజ్మెంట్ ఎజెన్సీ క్రియేటివ్ డైరెక్టర్. జాతీయస్థాయిలో గుర్తింపుతో సహా  విజయవంతమైన వృత్తినిపుణుడిగా తన హోదాకు తగ్గరీతిలో నగర శివార్లలోని విల్లాకొని నివాసాన్ని అక్కడికి మార్చాడు. ఆపీసుకు వచ్చివెళ్లేందుకు  రోజూ దాదాపు రెండు గంటలపాటు నలభై కి.మీ. ప్రయాణం, సమయాభావం తీవ్రమైన ఒత్తిడి కలిగించాయి. ఉత్సాహంగా పనిచేస్తూ టీమును ఉత్తేజ పరచే వ్యక్తి కాస్తా తరచూ నీరసపడి పోతున్నాడు. హఠాత్తుగా శరీరం బరువు తగ్గిపోయింది. విపరీతమైన దాహం, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావటంతో ఇబ్బందిగా అనిపించింది. ఈ మార్పులతో ఆందోళన చెంది డాక్టరును కలవగా పరీక్షలు చేసి శ్రీరామ్ టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారించి చికిత్స ప్రారంభించారు. డాక్టర్ సూచనలమేరకు మందులు వేసుకుంటుండటం, జీవనశైలిలో మార్పుచేసుకోవటం వల్ల పరిస్థితి మెరుగుపడటం మొదలయ్యింది. కానీ ఇటువంటి పరిస్థతే ఎదురైన చాలా మంది ఇది సాధారణ బలహీనత(జనరల్ వీక్నెస్) అనుకుని పెద్ద పొరపాటు చేస్తున్నారు.  పేరులో తీపి(మధు – షుగర్)తో జీవితంలో చేదును నింపే ఆరోగ్యానికి తీరని నష్టం కలిగించే మధుమేహ(డయాబెటిస్) విస్తరించటానికి అవకాశం కల్సిస్తున్నారు.

డయాబెటిస్ లో రకాలు – తీవ్రత: 

వైద్యులు డయాబెటిస్  మిలిటస్ అని పేర్కొనే మధుమేహం జీవితాంతం వెంటాడే దీర్ఘవ్యాధి ఇది ఆహారం ద్వార అందే శక్తిని ఉయోగించుకునే శరీర సామర్థ్యాన్ని దెబ్బదీస్తుంది. దీనిలో  టైప్ -1, టైప్ -2, టైప్ -3 డయాబెటిస్ అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో సాధారణ భాషలో షుగర్ వ్యాధికి మారు పేరుగా ఉన్న టైప్ -2 డయాబెటిస్ అత్యధిక సంఖ్యాకుల(95శాతం మంది)ను వేధిస్తున్న వ్యాధి. ఇది ఇపుడు మనదేశంతో సహా ప్రపంచదేశాలలో మానవవనరులకు తీరని నష్టం కలిగిస్తూ కుంటుబాల పై తీరని ఆర్థిక భారాన్ని మోపుతున్న ప్రధాన వ్యాధిగా తయారయ్యింది. ప్రపంచ జనాభాలో 8.5 శాతం మంది, మొత్తం 39 కోట్ల మంది మధుమేహ వ్యాధి పీడితులేనని అంచనా. మనదేశానికి వస్తే జనాభాలో 7శాతం, 6.2 కోట్ల మందికి డయాబెటిస్ ఉన్నది. వ్యాధిగ్రస్తులలో సగం మందికి అసలు తాము మధుమేహ వ్యాధి పీడితులం అన్న విషయం కూడా తెలియకపోవటం ఈ వ్యాధికి సంబంధించి విషాదకర అంశం.  ఏటా 10 లక్షల మంది భారతీయులు ఈ వ్యాధి వల్ల అకాల మరణం పాలవుతున్నారు. మధుమేహం వ్యాధిలో రకాలు ఏమిటి? ఇవి  ఎందుకు వస్తున్నాయి? ఈ వ్యాధివల్ల ఎదురయ్యే ఇతర ప్రమాదాలు ఏమిటి? దీని  బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే డయాబెటిస్ గూర్చి వైద్యనిపుణులు  ఎందుకు అంతగా ఆందోళన చెంది హెచ్చరిస్తున్నారో తెలిసి జాగ్రత్తపడగలుగుతాం.

ఎందువల్ల వస్తుంది?

మధుమేహ వ్యాధి మూడు రకాలు. వీటిలో మొదటిదైన టైప్ -1 డయాబెటిస్. ఇది ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాల్సిన క్లోమం విఫలం అవటం వల్ల వస్తుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్లోమం పై దాడిచేయటం(ఆటో ఇమ్మ్యూన్) వల్ల ఇన్సులిన్ తయారుచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని కూడా అంటున్నారు. వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడే మొదలయ్యే ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుండటాన్ని గుర్తించారు.   శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటం వల్ల రెండో రకపు మధుమేహమైన టైప్-2 డయాబెటిస్ ఏర్పడుతుంది. దీనిలో శరీరం తనకు అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తిచేసుకున్నా దానికి స్పందిచగల శక్తిని కోల్పోయి  ఉపయోగించుకోవటంలో విఫలం అవుతుంది.  మన దేశంలో సగటున 43 సం. వయస్సులో ఈ వ్యాధికి గురువుతున్నారు. అయితే ఇటీవలి సంవత్సరాలో ఊబకాయం వల్ల కొందరు పిల్లలు కూడా టైప్-2 మధుమేహం బారిన పడుతున్నారు. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని పేర్కోనే ఈ వ్యాధి టైప్ -1 మధుమేహం అంతటి తీవ్రమైనది కాదు. అయినప్పటికీ తీవ్రమైన ఆరోగ్యసమస్యలను మాత్రం సృషించి దీర్ఘకాలంతో తీరని నష్టాన్ని కలిగించగలుగుతుంది.  ఇక చివరిదైన టైప్ -3 డయాబెటిస్ గర్భధారణ వల్ల ఏర్పడుతుంది.  ఈ వ్యాధి తాత్కాలికమైనది. గర్భవతులలో 2 నుంచి 10 శాతం మందిలో కనిపించే ఈ వ్యాధిని గెస్టటైనల్ డయాబెటిస్ అంటున్నారు. గర్భధారణ తరువాత మధ్య, చివరి దశలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ఈ డయాబెటిస్ ను అదుపుచేయటం గర్భస్థశిశువు ఆరోగ్యాన్నికాపాడటానికి అత్యవసరం.

మధుమేహం – ఎందుకింత ప్రమాదం?

ఈ మూడూ రకాల డయాబెటిస్ల వల్ల శరీరంలో వ్యక్తమయ్యే ఫలితం ఒకటి ఉంది. మన ఆహారంగా తీసుకున్న పిండిపదార్థాలను  శరీరం సాదారణంగా గ్లూకోస్ అనే ప్రత్యేక చక్కెరగా విడగొడుతుంటుంది. ఈ గ్లూకోసే మన దేహానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే ఇందుకోసం శరీర కణాలకు ఇన్సులిన్ అనే హర్మోన్ అవసరం అవుతుంది. డయాబెటిస్ వల్ల శరీరం ఇన్సులిన్ ను తయారుచేసుకోలేకపోవటమో లేక ఉత్పత్తయిన ఇన్సులిన్ ఉపయోగించుకోలేకపోవటమో జరుగుతుంది. కొన్ని సారు ఈ రెండు లక్షణాలూ కనిపిస్తాయి. శరీరం గ్లూకోస్ ను వాడుకోలేకపోవటం వల్ల రక్తంలో దాని పరిమాణం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోస్ శాతం పెరగటం మూత్రపిండాలు, గుండె, కళ్లు, నాడీమండలంలోని అతిచిన్న రక్తనాళాలకు నష్టం కలిగిస్తుంది.అందువల్లనే మధుమేహాన్ని గుర్తించి చికిత్సచేయని పక్షంలో అది గుండెవ్యాధులకు, పక్షవాతానికి, మూత్రపిండాల వ్యాధులకు, అంధత్వానికి, పాదాలలోని నాడులు-రక్తకేశనాళికల వ్యాధుల(డయాబెటిక్ ఫుట్ లాంటి) కు దారితీస్తుంది.

దీనికి చికిత్స ఏమిటి?

మధుమేహం తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు కారణమవుతుందన్నది ఆందోళన కలిగించే విషయం. అయితే నల్లని మబ్బులాగా కమ్ముకువచ్చే ఈ సమస్యకు ఆధునికవైద్యం పరిష్కారం చూపించి అదుపులో ఉంచగలగుతుందన్న అంశం  ఆ మబ్బుకు వెండి అంచులా కనిపిస్తుంది. డయాబెటిస్ ను గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించటం ద్వారా వ్యాధి మరింత విస్తరించకుండా అదుపుచేయటమే కాకుండా పూర్తి సాధారణ జీవితం గడపవచ్చున్ని యశోద ఆస్పత్రిలోని  ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిస్ విభాగం వైద్యనిపుణులు చెప్పారు. మధుమేహ వ్యాధికి సంబంధించి అత్యధునిక  చికిత్సా పద్దతులు అభివృద్ధి చెందాయని, ఉత్తమ ఫలితాలను ఇవ్వగల మందుల అందుబాటులోకి వచ్చాయని చెబుతూ వారు ఆ మందులను వాడటం, సూచించిన ఆహార, విహార నియమాలను పాటించటం ద్వారా మధుమేహ వ్యాధి దాడిని ఖచ్చితంగా నియంత్రించవచ్చునని వివరించారు.

డయాబెటిస్ ను నిరోధించటం ఎలా?

కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం ద్వారా అత్యధికులలో కనిపించే టైప్ -2 డయాబెటిస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇందులో మొదటిది శరీర బరువును అదుపులో ఉంచుకోవటం. వ్యక్తి పొడవు, శరీరపు బరువు ఆధారంగా లెక్కించే బి.ఎం.ఐ.(బాడీ మాస్ ఇండెక్స్)బి.ఎం.ఐ. 25 కి.గ్రా/ఎం2 లోపు ఉండేట్లు చూసుకోవాలి. అధిక బరువు దశ (బి.ఎం.ఐ. 25 కి.గ్రా/ఎం2 నుంచి 30కి.గ్రా /ఎం2 వరకూ)కు చేరుకున్న పక్షంలో వెంటనే పోషకాహార, వ్యాయామ నిపుణుల సాయంతో బరువును తగ్గించుకునేందుకు పూనుకోవాలి. శరీరం బరువు అదుపులేకుండా పెరిగిపోయి ఊబయకాయం ఏర్పడితే డాక్టర్లను కలిసి బరువును తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను తెలుసుకుని పాటించాలి. దీనితోపాటు మితిమీరిన  పిండిపదార్థాలు – కొవ్వు అధికంగా ఉండే అనారోగ్యకరమై ఆహారాన్ని తగ్గించి పళ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యపానం, రాత్రిళ్లు ఎక్కువ సమయం మెలుకువగా ఉండే జీవనశైలిని మార్చుకోవాలి. మొత్తం మీద చూస్తే అత్యధిక సంఖ్యాకులకు సంబంధించి మధుమేహ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చు. అనివార్యంగా ఆ వ్యాధి బారిన పడ్డా వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స పొందటం ద్వార ఆ వ్యాధిని అదుపులో ఉంచుకుని సాధారణ జీవితం గడపవచ్చు.

#

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s